** TELUGU LYRICS **
ఏలాంటి వాడవైనా
నీ వెంత ఘనుడవైనా
కనుమూసే కాలమొకరోజు
ఉన్నదని మరువబోకుమన్నా
నీ వెంత ఘనుడవైనా
కనుమూసే కాలమొకరోజు
ఉన్నదని మరువబోకుమన్నా
1. నీకు మేడ మిద్దెలున్నా
నీవు ప్రభుని చూడలేవు
మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి
ప్రభునడిగి చూడమన్నా
||ఏలాంటి||
2. నీకు ధనము బలగమున్నా
నీవు విర్రవీగకన్నా
ఆ ధనము కాస్తా తరిగిపోతే
దరికెవరు రారు సున్నా
||ఏలాంటి||
3. పాపుల కొరకు ప్రభువు
కలువరిగిరిపైన
ఆసిల్వవేసి దుర్మారులంత
బహుబాధ పెట్టిరన్నా
||ఏలాంటి||
4. నీవు పాపరోగివయ్యా
ప్రభు పిలుచుచున్నడయ్యా
ఆ ప్రభువునే పాదాలసాక్షిగా
ఎరిగి నడువుమయ్యా
||ఏలాంటి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------