510) ఏల వర్ణించనయ్యా కల్వరి యాగం

** TELUGU LYRICS **

ఏల వర్ణించనయ్యా కల్వరి యాగం
ఆ సిలువ ప్రయాణం (2)
ఏమని కొనియాడనయ్యా నీ రక్షణ త్యాగం
ఆ రక్త ప్రయాసం
ఏల వర్ణించనయ్యా కల్వరి యాగం
ఆ సిలువ ప్రయాణం
నీ రక్తమిచ్చి నను కొన్న ప్రయాణం
నీ ప్రాణమిచ్చి నాకు విలువిచ్చిన త్యాగం
ఏల వర్ణించనయ్యా

వీరేమి చేయుచున్నారో ఎరుగరని క్షమించి (2)
నీ గొప్ప క్షమాగుణము నీవు నాకు నేర్పితివా (2) 
||ఏల||

నీవు పరదైసులో ఉందువని దొంగతో (2)
నా స్తితి గమనించి నా పాపము క్షమియించినావా (2)
||ఏల||

నీ తల్లిని నీ శిష్యునకు అప్పగించినావా (2)
నా తల్లిని నా తండ్రిని గౌరవించుమన్నవా (2)
||ఏల||

నా దేవా నా దేవా నను విడనాడితివన్నావా (2)
నా పాప భారము మోసి నన్ను విడిపించినావా (2)
||ఏల||

నేను దప్పిగొన్నానని నీవు మొర్ర పెట్టినావా (2)
నా హృదయమే నీ దాహం నా రక్షణే నీ త్యాగమయా (2)
||ఏల||

నీవు సమాప్తమైనదని నీ ఆత్మను అప్పగించి (2)
నీ తండ్రి చిత్తమునే నీవు నెరవేర్చినావా (2)
||ఏల||

అప్పగించినావా నీ అత్మను నీ తండ్రికి (2)
నా ఆత్మను పరము చేర్చ మార్గమునే తెరచినావా (2)
||ఏల||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------