351) ఉన్నత దుర్గము నా దేవుడే

** TELUGU LYRICS **

    ఉన్నత దుర్గము - నా దేవుడే
    నా రక్షకుడే - నాకాశ్రయుడు

1.  యెహోవా మహాత్మ్యము - ఎంతో గొప్పది
    అధిక స్తోత్రములకు - పాత్రుండాయనే
    ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది

2.  నా కోటయు నాశైలము ఆయనే
    నాకేడెము రక్షణ శృంగమును
    ఉన్నతమగు దేవుడే - నాకా శ్రయ దుర్గము

3.  నా ప్రియ ప్రభువు - దవళవర్ణుడు
    రత్నవర్ణుడు - నాకతి ప్రియుడు
    పదివేల మందిలో - అతని గుర్తించెదను

4.  నిత్యజీవము - మెండుగ నొసగి
    పరమాహారము - తృప్తిగ నిచ్చె
    నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము

5.  విజయ గీతము - పాడెద ప్రభుకే
    విజయము నిచ్చెను - శత్రువుపైన
    ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము

6.  మహిమ పూర్ణుడు - నా ప్రభుయేసు
    ఇహకేతెంచును - నాకై త్వరలో
    హల్లెలూయ స్తోత్రముల్ - పాడి ప్రహర్షింతును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments