352) ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు

** TELUGU LYRICS **

    ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
    ఎన్నతగిన మహారక్షణ శిఖరము
    సుందర మొందు సదా (2)

1.  మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె
    మరణపు ముల్లును విరచి జయంబును
    యేసు అనుగ్రహించెన్ (2)

2.  ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో
    దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలిచి
    సంతస మొందెదరు (2)

3.  ఆశ్చర్యకరుడాయనే - ఆలోచన కర్తయును
    నిశ్చయముగా బహు బుద్ధివివేకము
    లిచ్చి నడుపు సదా (2)

4.  చంచల హృదయులును - ముష్కరులగు పాపులును
    వంచనలేక వాక్యమునకు
    తలవంచి విధేయులౌదురు (2)

5.  కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను
    నడువుడి త్రోవయిదే యను శబ్దము
    చెవులకు వినబడును (2)

6.  పక్షిరాజు తనదు - పిల్లల కాచెడు రీతి
    రక్షణ కర్త యెహోవా నిన్ను
    కాచి రక్షించు సదా (2)

7.  సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు
    అందమైన యా పరలోక రాజ్యము
    ప్రబలుట చూచెదవు (2)

** ENGLISH LYRICS **

Unnatha Sthalamulapai Nekkinchi Choopinchu Prabhu
Ennathagina Maharakshana Shikharamu
Sundhara Mondu Sadaa (2)

1. Maranamu Mringabade - Ghana Vijayamu Praapthamaye
Maranapu Mullunu Virachi Jayambunu
Yesu Anugrahinchen (2)

2. Evaru Manassu Prabhupai - Nishchalamuga Nilpedharo
Dhaiva Shaanthi Nondhi Kreesthutho Nilichi
Santhasa Mondhedharu (2)

3. Aascharyakarudayane - Aalochana Karthayunu
Nishchayamugaa Bahu Buddhivivekamu
Licchi Nadupu Sadaa (2)

4. Chanchala Hrudhayulunu - Mushkarulagu Paapulunu
Vanchanaleka Vaakyamunaku
Thalavanchi Vidheyulaudhuru (2)

5. Kudiki Thiriginanu - Mari Yedamaku Thiriginanu
Naduvudi Throvayidhe Yanu Shabdhamu
Chevulaku Vinabadunu (2)

6. Pakshiraaju Thanadu - Pillala Kaachedu Reethi
Rakshana Karthu Yehovaa Ninnu
Kaachi Rakshinchu Sadaa (2)

7. Sundharamagu Raajun - Nee Kanulatho Choochedhavu
Andhamaina Yaa Paraloka Raajyamu
Prabaluta Choochedhavu (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------