350) ఉన్నత గృహమును త్వరగా చేరి

** TELUGU LYRICS **

1.  ఉన్నత గృహమును త్వరగా చేరి
    సంపన్నుని దర్శింతును - ఈ
    పేదగు నా కోర్కె సఫలము చేసిన
    నాథుని కొనియాడుదున్

2.  దూతల మధ్యను స్తోత్రము లొందెడు
    ప్రభుని స్తోత్రింతును - సు
    గంధము వీచెడి పుష్ప రాజంబుల
    మధ్యను నిద్రింతున్

3.  ఆకాశ గణములు సేవించుచుండగ
    వీకతో వారిజేరుదున్ - నా
    యేసుని స్తుతుల నోరార పాడి
    భాసురముగ నుతింతున్

4.  స్ఫటిక నది తీరమున నేను
    పాడుచు తిరుగుదును - ఆ
    బంగారు వీధిలో యేసుతో నేను
    రంగుగ నడుగిడుదున్

5.  పలువిధ మృగములు పైబడినను
    నెవ్విధమున భయపడను - ఆ
    వెంగియు సింహము నాపై వచ్చిన
    నగవుతో రమ్మనెదన్

6.  పక్షులు అయ్యెడ ననేకముండును
    వృక్షఫలములుండున్ - నా
    రక్షకుడగు యేసు నాకై చేర్చిన
    అక్షయ ధనముండున్

7.  పేతురు యోహాను పౌలుతో నేనును
    ప్రీతితో వసియింతును - నా
    చల్లని మిత్రుని ఇంటను హర్షముతో
    హల్లెలూయ పాడెదను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------