361) ఉల్లసించి పాటపాడే పావురమా

** TELUGU LYRICS **

    మృధు మధుర సుందర నారీమణీ
    ఎద పవళించు నా ప్రాణేశ్వరీ
    ఒక్క చూపుతో నీవాడనైతి
    ఒక్క పిలుపుతో నీ వశమైతి
    పావురమా నా పావురమా
    నా నిర్మల హృదయమా నా పావురమా
    
    ఉల్లసించి పాటపాడే పావురమా
    ఓ ఓ ఓ పుష్పమా షారోను పుష్పమా
    వాగ్దానదేశపు అభిషేక పద్మమా
    లెబనోను పర్వత సౌందర్యమా

1.  పాలుతేనెలో పవళించి
    పరిమళ వాసనలు విరజిమ్ము
    జీవజలాలలో విహరించి
    జీవఫలాలను ఫలియించు
    ఉల్లసించి పాటపాడే పావురమా
    నా పావురమా నా షారోను పుష్పమా
    నా పావురమా నా షాలేము పద్మమా
    ||ఓ ఓ ఓ పుష్పమా||

2.  జల్ధరు వాసనలు శ్వాసించి
    జగతికి జీవమును అందించు
    సంధ్యారాగము సంధించి
    సుమధుర స్వరమును వినిపించు
    ఉల్లసించి పాటపాడే పావురమా
    పావురమా నా షారోను పుష్పమా
    నా పావురమా నా షాలేము పద్మమా
    ||ఓ ఓ ఓ పుష్పమా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------