** TELUGU LYRICS **
ఉల్లాసమే ఉత్సాహమే
ఉరికే వురిమే సంతోషమే
ఉప్పొంగి అలరించే ఆనందమే
ఊరంతా క్రిస్మస్ సంబరమే
ఉప్పొంగి అలరించే ఆనందమే
ఊరంతా క్రిస్మస్ సంభ్రంభమే
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్
నేడు రక్షకుడు పుట్టెను చూడు
వీడి పరము భువికేగెను ఱేడు
చూడ ముచ్చటగా ప్రభువున్నాడు
తోడు నీడగా నెనరైనాడు
వాడబారని మహిమై నిలిచాడు
అడుగు అడుగునా స్తుతి స్తోత్రార్హుడు
ఆడిపాడగా వేడుకలైనాడు
పరిశుద్ధుడు ప్రియయేసుడు
పశువుల పాకలో పవళించెగా
పరుగిడి యేసుని చూడాలిగా
నిందకు ప్రతిగా ఘనతనీయగా
నలిగిన వారికి నెమ్మదినీయగా
దీనజనులను ఆదరించగా
దుఃఖాక్రాంతులను ఓదార్చగా
శపభారమును దీవెనలుగా
అంగలార్పును నాట్యంబుగా
కారు చీకటిలో కాంతినీయగా
నిత్యానందము కలుగజేయగా
అభిషిక్తుడు అద్వితీయుడు
ఆశ్చర్యకరుడు ఉదయించెగా
అనురాగముర్తిని దర్శించగా
ఉరికే వురిమే సంతోషమే
ఉప్పొంగి అలరించే ఆనందమే
ఊరంతా క్రిస్మస్ సంబరమే
ఉప్పొంగి అలరించే ఆనందమే
ఊరంతా క్రిస్మస్ సంభ్రంభమే
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్
నేడు రక్షకుడు పుట్టెను చూడు
వీడి పరము భువికేగెను ఱేడు
చూడ ముచ్చటగా ప్రభువున్నాడు
తోడు నీడగా నెనరైనాడు
వాడబారని మహిమై నిలిచాడు
అడుగు అడుగునా స్తుతి స్తోత్రార్హుడు
ఆడిపాడగా వేడుకలైనాడు
పరిశుద్ధుడు ప్రియయేసుడు
పశువుల పాకలో పవళించెగా
పరుగిడి యేసుని చూడాలిగా
నిందకు ప్రతిగా ఘనతనీయగా
నలిగిన వారికి నెమ్మదినీయగా
దీనజనులను ఆదరించగా
దుఃఖాక్రాంతులను ఓదార్చగా
శపభారమును దీవెనలుగా
అంగలార్పును నాట్యంబుగా
కారు చీకటిలో కాంతినీయగా
నిత్యానందము కలుగజేయగా
అభిషిక్తుడు అద్వితీయుడు
ఆశ్చర్యకరుడు ఉదయించెగా
అనురాగముర్తిని దర్శించగా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------