1076) తల్లి తన బిడ్డను మరచినా గాని

** TELUGU LYRICS **

తల్లి తన బిడ్డను మరచినా గాని
మరువదయ్యా నీ ప్రేమ నన్ను
పర్వతములు తొలగినా గాని
విడువదయ్యా నీ కృప నన్ను (2)
దుఃఖ దినములే దరి చేరినా
దారి కానక నే చెదరినా (2)
మరువదయ్యా నీ ప్రేమ నన్ను
విడువదయ్యా నీ కృప నన్ను 
||తల్లి||

నశించిపోయిన నన్ను వెదకి రక్షించినావు
పాపినైన నాకై నీ ప్రాణమునర్పించినావు (2)
నీతిమంతుని కొరకైననూ
ఒకరు చనిపోవుట అరుదుగా (2)
ఏ మంచియు లేనట్టి నాకై
ఎందుకయ్యా నీ త్యాగము (2) 
||దుఃఖ దినములే||

దారి తొలగిన నేను గొర్రె వలె తిరిగాను
కాపరివైన నిన్ను కాదని వేసారినాను (2)
నీవు చేసిన మేళ్లన్ని మరచి
దూరమైతిని నిను నేను విడచి (2)
అయిననూ నా రాక కొరకై
వేచియుంటివా ఓ జాలి హృదయా (2)
||దుఃఖ దినములే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------