602) ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి

** TELUGU LYRICS **

    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
    మేలుదొరికె నేడు చూసుకో నీ జీవితం పండించుకో (2)

1.  తలితండ్రుల విడచి – తన ఇంటిని మరచి
    నీతోనె లోకమై జీవించగా
(2)
    కలకాలం ఈ ధరలో నీతో నడువ 
(2)
    నీముందర నిలచే సతి చేయి అందుకో
    ఓ సోదరి అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
    వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో

2.  పుట్టినింటి ఘనత – తరతరములు నిలుప
    నీ భర్త గౌరవం కాపాడగా 
(2)
    అణకువతో మెళకువతో ఇంటిని తీర్చ 
(2)
    వినయముతో నిను పతికి అర్పించుకో 
    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
    వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో

3.  పరలోక సైన్యం తిలకించుచుండ 
    పరిశుద్ధుల సంఘం ప్రార్ధించుచుండ (2)
    అనురాగం ఐక్యతతో జతకమ్మని 
(2)
    పలికింది ప్రకృతి ఈ స్వాగతం 
    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
    వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments