** TELUGU LYRICS **
ఓ ప్రేమమూర్తి ఓ త్యాగమూర్తి
ఓ క్షమామూర్తి ఓ కరుణమూర్తి
గెత్సెమనే తోటలో పట్టబడి
సంకెళ్ళతో బంధింపబడి
ప్రధాన యాజకులతో అపహసించబడి
నిందింపబడి నేరము మోపబడి
మనుష్యుల వలన తృణీకరింపబడిన ఓ యేసయ్యా
పిలాతు హేరోదు ఎదుట నిలువబడి
అన్యాయముగా తీర్పు తీర్చబడి
సైనికుల కొరడాలతో కొట్టబడి
వీపు దున్నబడి ఉమ్మి వేయబడి
ముళ్ళ కిరీటము తలపై పెట్టబడిన ఓ యేసయ్యా
యేరుషలేము వీధులలో ఈడ్వబడి
చేతులు కాళ్ళలో మేకులు కొట్టబడి
కల్వరి గిరిపై సిలువ వేయబడి
ప్రక్కలో పొడవబడి రుధిరం కార్చబడి
మరణాన్ని పొంది తిరిగి లేపబడిన ఓ యేసయ్యా
ఓ క్షమామూర్తి ఓ కరుణమూర్తి
గెత్సెమనే తోటలో పట్టబడి
సంకెళ్ళతో బంధింపబడి
ప్రధాన యాజకులతో అపహసించబడి
నిందింపబడి నేరము మోపబడి
మనుష్యుల వలన తృణీకరింపబడిన ఓ యేసయ్యా
పిలాతు హేరోదు ఎదుట నిలువబడి
అన్యాయముగా తీర్పు తీర్చబడి
సైనికుల కొరడాలతో కొట్టబడి
వీపు దున్నబడి ఉమ్మి వేయబడి
ముళ్ళ కిరీటము తలపై పెట్టబడిన ఓ యేసయ్యా
యేరుషలేము వీధులలో ఈడ్వబడి
చేతులు కాళ్ళలో మేకులు కొట్టబడి
కల్వరి గిరిపై సిలువ వేయబడి
ప్రక్కలో పొడవబడి రుధిరం కార్చబడి
మరణాన్ని పొంది తిరిగి లేపబడిన ఓ యేసయ్యా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------