580) ఓ భక్తులారా మనమందరము

** TELUGU LYRICS **

    ఓ భక్తులారా మనమందరము
    నిత్యము యేసుని స్తుతియించెదము

1.  గత కాలమున మన ప్రభుయేసు
    నూతన దీవెనలను - ఖ్యాతిగా నొసగే మనకు
    స్తుతియించెద మేసుని
    నూతన అనుభవములను - ఖ్యాతిగా సర్వశక్తుని

2.  శక్తిమంతుడు మన ప్రభు యేసు
    నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే
    సంపూర్ణముగా కాయున్
    సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు

3.  ఎన్ని శోధనలు భువినున్న
    తానే మనలను విడిపించును - శోధింపబడెను యేసు
    తన సహాయము నొసగున్
    కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో

4.  శక్తిమంతుడు మన ప్రభు యేసు
    తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా ప్రభువు
    నిలుపును తన మహిమతో
    తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల

5.  కృంగిన భక్తులారా మీరు
    భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము
    జయము జయమని ప్రభుకే
    యుగ యుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------