** TELUGU LYRICS **
ఓ ప్రేమగల యేసు - ప్రేమించినావు మమ్ము
స్మరించుచు స్తుతింతున్ - రక్షణ నిచ్చినావు
స్మరించుచు స్తుతింతున్ - రక్షణ నిచ్చినావు
1. అద్భుత యాగమందు - అందరికై బలియై
అందరి పాపములకు - ప్రాయశ్చిత్తమైతివి
అందరి పాపములకు - ప్రాయశ్చిత్తమైతివి
2. దాసులమై మేముండ - మోషేను పంపితివి
చేసితివి స్వతంత్రులుగా - నీ బాహుబలము తోడ
చేసితివి స్వతంత్రులుగా - నీ బాహుబలము తోడ
3. క్షమాపణానందముతో - సాగింపచేసి మమ్ము
యాత్రలో మాకు తోడై - విజయము నిచ్చితివి
యాత్రలో మాకు తోడై - విజయము నిచ్చితివి
4. ఎడారి అడవిలోన - ఊటల నదులు నడిపి
ఎండిన నేలనంత - పచ్చిక బయలు చేసెన్
ఎండిన నేలనంత - పచ్చిక బయలు చేసెన్
5. బాబెలు నుండి మమ్ము - విడిపించితివి నీవు
బంధకముల తెంచి - తప్పు బోధ బాపినావు
బంధకముల తెంచి - తప్పు బోధ బాపినావు
6. సహవాసమిచ్చి సంఘ - అంగముల జేసినావు
సాక్షులను చేసి మమ్ము - శత్రువుల సిగ్గుపరచె
సాక్షులను చేసి మమ్ము - శత్రువుల సిగ్గుపరచె
7. మహా ప్రేమ గల యేసు - మాకై చేసితివన్ని
ఘనపరతు హల్లెలూయ - ఈ గొప్ప రక్షణ కొరకు
ఘనపరతు హల్లెలూయ - ఈ గొప్ప రక్షణ కొరకు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------