571) ఓ ప్రభువా నీ సేవన్ చేసెద నిత్యము

** TELUGU LYRICS **

    ఓ ప్రభువా నీ సేవన్ - చేసెద నిత్యము (2)
    నీ మాటే వినెద - నరుని మాట వినకుందు (2)

1.  శోధించు స్వరములు - వినబడుచునున్నవి వేధించు నేరములు
    పైబడుచునున్నవి - బోధించు నీ మార్గం - వినిపించు నీ స్వరము

2.  బలమైన శత్రువు - బాధించుచున్నాడు విలువైన నీ రక్తం
    ప్రోక్షించు నాపైన - నీ హస్త బలముతో - జయమును నాకిమ్ము

3.  లోకాశలు నన్ను - కదిలించుచున్నవి నిరాశ సమయములు
    బెదిరించుచున్నవి - ఆకాశము నుండి - ఆదరించుము నన్ను

4.  బేతేలు దర్శనము - స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటం
    దినదినము నేర్పించు - నా కాలమంతయు - నను నడుపు నా ప్రభువా

5.  మెల్లని నీ స్వరమున్ - మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్
    నా కొరకు చూపించు - నీ వెలుగులో నన్ను - నిత్యము నడిపించు

6.  పరిశోధించుము నన్ను - పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్
    ప్రభునింపు నీ కొరకే - పరిశుద్ధ సంఘములో - అంగముగా ధౄఢపరచు

7.  క్రీస్తే నా జ్ఞానము - క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయము
    క్రీస్తే నా ఆశ్రయము - క్రీస్తే నా రారాజు - క్రీస్తే నా సర్వము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------