** TELUGU LYRICS **
ఓ ప్రభువా యిది నీ కృపయే - గొప్ప క్రయము ద్వారా కలిగె
1. కృపద్వారానే పాపక్షమాపణ - రక్తము ద్వారానే కలిగె
అపరాధముల నుండి విమోచన - యేసులో మనకు ప్రాప్తించె

2. కృపద్వారానే కలిగిన రక్షణ - మానవులొసగ జాలరిల
క్రియలద్వారా కలుగలేదు - యేసు ప్రభుని వరమిదియే

3. కృపతో మనల పిలిచెను ప్రభువు - పరిశుద్ద పిలుపుద్వారా
అపరిమిత సంకల్పమువలన - మనమెరిగితిమి ఈ ధరలో

4. కృపద్వారానే నీతి మంతులుగా - తీర్చెను మనల ఉచితముగ
అపాత్రులమైయున్న మనకు - ప్రాయశ్చిత్తము కలిగెనుగ

5. కృపయే మనకు బయలు పడెను - సమస్తమును భోధించును
అపవిత్ర క్రియలన్నియు విడచి - భయభక్తులతో బ్రతికెదము

6. కృపద్వారానే బలవంతులమై - ఎదురుకొనెదము యుద్ధమును
ప్రభువునందు అంత మువరకు - స్థిరముగ ముందుకుసాగెదము

7. కృపద్వారానే సమీపించితిమి - దానియందే నిలిచితిమి
క్రీస్తు మహిమ నిరీక్షణకై - ఆయనకే స్తుతి పాడెదము

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :