573) ఓ పావనులారా మీరు విశ్వాసంపు

** TELUGU LYRICS **

1.  ఓ పావనులారా - మీరు విశ్వాసంపు
    పునాది యెంతెంతో - స్థిరమైనది
    శ్రేష్ఠంపు వాక్య - మా కందము
    నిచ్చున్ - శ్రీ యేసు నాశ్రయించు
    శ్రీ యేసు నాశ్రయించు - తన్నాశ్రయించు వారే ధన్యులు

2.  నీ కెట్టి విపత్తు - సంభవింపగాను
    నే నీతో నున్నాను భయ - మేటికి
    దేవుడన్ - నే నీ కొనర్తున్ సాయం
    నా గొప్ప శక్తితోను - నా గొప్పశక్తితోను
    నా గొప్ప శక్తితోను - నిన్నిల్పుదు

3.  దేవాగ్ని పరీక్షలు - నీకు కల్గగాను
    కృపాశక్తి మెండుగా - నీకిత్తును
    ఆ మంట నిన్ను - నావరింపగాను
    నీలోని కల్మషంబు - నీ లోని కల్మషంబు
    నీలోని కల్మషంబు - దహించును

4.  వృద్ధాప్యము నందు - స్వంత ప్రజలెల్ల
    నా మారని ప్రేమ రుచి - చూతురు
    ప్రాయమున్ ప్రొద్దు - గ్రుంకినట్టి వేళన్
    నే కౌగిలింతు వారిన్ - నే కౌగిలింతు వారిన్
    నే కౌగిలింతు వారిన్ - నా కౌగిటన్

5.  నా యందు విశ్వాస - ముంచునట్టి
    యాత్మన్ - నే విడ్వను శత్రుకోటి - చేతికిన్
    పాతాళ మెల్లన్ - వాని మ్రింగజూడన్
    నే నెల్ల వేళలందు - నే నెల్ల వేళలందు
    నే నెల్ల వేళలందు - రక్షింతును 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments