567) ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము

** TELUGU LYRICS **

1.  ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ
    మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు
    ||ఓ||

2.  నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు
    సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్
    నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు 
    ||ఓ||

3.  పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా
    ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు
    ||ఓ||

4.  కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా
    సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు
    కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు
    ||ఓ||

5.  మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల
    మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్
    ||ఓ||

6.  నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను
    గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట
    బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే
    ||ఓ||

7.  నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు
    నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము
    పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే
    ||ఓ||
8.  నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము
    వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్
    ||ఓ||

9.  నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ
    బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్
    ||ఓ||

10. ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము
     మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్
    ||ఓ||

11. ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు
     శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము
    ||ఓ||

** ENGLISH LYRICS **

1. O Prabhundaa Nin Nutheenchuchunnaamu Vinayamuthoda
Maa Prabhundaa Vanchu Ninnu Maanaka Maemoppukondhu
||O||

2. Nithyudhavau Thandri Lokamu Ninnaraadhinchuchu Nundu
Sathyadhoothal Mokshamandhu Sarva Pradhaanal Subhakthin
Nithya Maeka Kanthamuthoda Nin Goniyaduchunnaru
||O||

3. Parishuddha, Parishuddha Parishuddha, Saenala Dheva
Dharapara Lokambuluni Nee Vara Mahimatho Noppunatanchu
||O||

4. Keroobul Seroopul Ninnu~ Geerthinchuchunnarahaha
Saarekun Ninnaposthalula Sanghamu Sthothrinchuchundu
Koorimin Bravakthala Sanghamu Koniyaduchu Nin Nuthiyinchu
||O||

5. Maa Mahaa Janakaa Ninu Maanyudhau Puthrun Bahu Premagala
Maa Parishuddhaathmanu Breethitho Sanghamu Bhuvin Noppukonun
||O||

6. Neevae Kreesthu Raajavu Nithya Kumaarudavu Nee Vilalo Maanavulanu
Gaavaga~ Booninayapudu Paavana Kannyaa Garbhambuna ButtuTa
Bahudheenambanaka Chaavu Shrama Nodhinchi Sajjanulaku Dhivin Dherachithivae
||O||

7. Neevu Dhevuni Kudi Paarshwambuna Nithyamu Mahimaaseenudhavu
Neevu Maa Nyaayaadhipathivai Raavalayani Nammuchundhumu
Paavanambau Nee Rakthambuna Saevakulaku~ Thodhpadu Mipudae
||O||

8. Nithya Mahimamulo Ni~ka Needu Bhakthulathona Gathyamugaa Lekkinchumu
Vaarala~ Gani Rakshinchimi Nee Sujanambun
||O||

9. Neevu Dheevinchi Nee Nithya Swaasthyamubu Sujeevamidi Vaarala~
Baalinchi Laevaga~ Neththumu Sathathamu Preethin
||O||

10. O Prabhuvaa Paapamulo Nunda Kundaga~ Thodhpadumu
Maa Prabhuvaa Karuninchu Mammu~ Karuninchumu Dhayathodan
||O||

11. O Prabhundaa Ninnu Nammi Yunna Maaku~ Braemam~ Joopu
Shree Prabhundaa Ninnae Nammithi Siggunondha Neeyakumu
||O||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------