743) క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు

** TELUGU LYRICS **

    క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును
    కూడి పాడుదు మంగళం

1.  ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు
    మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం
    ||క్రీస్తు||

2.  జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు
    ప్రేమజూపిన అమరతేజుడ మంగళం
    ||క్రీస్తు||

3.  ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును
    కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం
    ||క్రీస్తు||

4.  మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము
    నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం
    ||క్రీస్తు||

5.  జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ
    పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం
    ||క్రీస్తు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------