742) క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె

** TELUGU LYRICS **

    క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె
    దాస్యపు కాడికి చిక్కుకొనకు

1.  నీవు ఈ లోకములో నున్నను - కాని ఈ లోకమునకు జెందవు
    లోకముతో ఏకీభవించకు లోకపు కాడికి చేరకుము

2.  నీ శరీరేచ్ఛ దురాశలను సిలువపైన అంత మొందించు
    పరిశుద్ధాత్మచే నడిపింపబడి శరీర ఆశల నెరవేర్చకు

3.  దేవుని వాత్సల్యమును పరిశుద్ధముగా మీ శరీరములన్
    అనుకూల సజీవ యాగముగ అర్పించుకొనుడి ప్రభువునకే

4.  మీరు క్రీస్తుతో లేపబడిన పైనున్న వాటినే వెదకుడి
    లోకమునకు మీరు మరణించి పరలోక వాటినే ప్రేమించుడి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------