714) కీర్తనీయమైనది క్రీస్తు గానసుధా

** TELUGU LYRICS **

కీర్తనీయమైనది క్రీస్తు గానసుధా
తరిగిపోని పెన్నిధి క్రీస్తు పుణ్యకథ
నీరాశల నిశీధిలో విరాగపు ఎడారిలో
కన్నతోడు ఉన్నదిక్కు క్రీస్తు నీకు జత
కరుణ జూపి కలత బాపు కన్న తండ్రి కథ
మనకున్న తండ్రి కథ
ఆకళైన వేళలో అన్నమతడు తెలుసుకో
చీకటిపడు వేళలో దీపమతడు తెలుసుకో
వేళా లేదు పాలా లేదు శరణు వేడగా
పేదా సాదా అంటే తాను కరుణ చూడగా
మహిజనులకు మహిమ దెలిపి ఆ మమతను చూపగా
తీరిపోవు వ్యధ
తళ్లడిల్లు వేళలో తల్లి ప్రేమ అతనిది
తననే విడనాడిన తండ్రి మనసు అతనిది
పాపాలెన్నో చేసే జన్మ పదములంటినా
కామం క్రోదం లోభం మోహం సిలువ వేసినా
కఠిన జనలకై నరులను ప్రేమ కలిగి బ్రోచినా
ప్రేమమూర్తి కథ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------