713) కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి


** TELUGU LYRICS **

కావాలి - కావాలి - నా యేసుకు సొంతం కావాలి 
రావాలి - రావాలి - నీలో గొప్పమార్పు రావాలి 
చేరాలి - చేరాలి - ప్రతిపాపి యేసును చేరాలి 
వంగాలి - వంగాలి - ప్రతి మోకాలు వంగాలి (2) 
||కావాలి||

పాడాలి - పాడాలి - రక్షణ గీతం పాడాలి 
చాటాలి - చాటాలి - యేసు వార్తను చాటాలి 
నమ్మాలి - నమ్మాలి - రక్షకుడేసుని నమ్మాలి 
పొందాలి - పొందాలి - పరిశుద్ధాత్మను పొందాలి (2) 
పరిశుద్ధతయే - మా ఆయుధం 
పరిశుద్ధగ్రంథం - మా ఆధారం 
పరిశుద్ధాత్ముడే - మాకు బలం 
మాకు బలం - మాకు బలం 
||కావాలి||

నిలవాలి - నిలవాలి - క్రీస్తుకు సాక్షిగా నిలవాలి
త్రొక్కాలి - త్రొక్కాలి - సాతానును అణగద్రొక్కాలి 
మారాలి - ప్రభుక్రీస్తు రూపులో మారాలి
చూడాలి - చూడాలి - దేవునిరాజ్యం చూడాలి (2) 
పరిశుద్ధతయే - మా ఆయుధం 
పరిశుద్ధగ్రంథం - మా ఆధారం 
పరిశుద్ధాత్ముడే - మాకు బలం 
మాకు బలం - మాకు బలం 
||కావాలి||

----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
----------------------------------------------------------------------------