628) కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు

** TELUGU LYRICS **

    కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు
    గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా

1.  ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను
    కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా 
    ||కఠిన||

2.  సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా
    సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా
    ||కఠిన||

3.  నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు
    జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!
    ||కఠిన||

4.  దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన
    గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు
    ||కఠిన||

5.  మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను
    వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు
    ||కఠిన||

6.  ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ
    రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే
    ||కఠిన||

7.  నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను
    ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన
    ||కఠిన||

8.  పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు
    దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు
    ||కఠిన||

9.  లోలోపలన న్యాయమబద్దములోపము కలిగిన మోసములో
    కాలయాపనచేయ నుపాయములేల? వేషధారణయేల
    ||కఠిన||

** ENGLISH LYRICS **

Kathina Hrudayama Karugava Devuni Gaduvulu
Gani Vinavaa Debbalu Galigina Lobadavaa

1. Enno Gaduvulu Ennomarulu Enno Gaduvulu Dorikinanunu
   Kannumoosikoni Kadaluchununduvu Kanikara Karamunugani Maanavaa
   ||Kathina||

2. Srushtikarthaku Mrokkedavaa! Thana Srushtini Goni Poojinchedavaa
   Srushtikartha Virodhi Dayyamula Cheshtalella Mandrinchedavaa
   ||Kathina||

3. Neeramu Rakthamugaa Maarinanu Bhaaramugaa Kappalu Pelu
   Jooregalu Goppa Tegulu Vacchina Gunapadenaa Pharoraaju!
   ||Kathina||

4. Daddurulail Bobbalu Pokkinanu Haddulēka Pidugulu Padina
   Gruddinatlu Vadagandlu Kurisinanu Gunapadenaa Pharoraaju
   ||Kathina||

5. Miduthala Dandulu Chelaregi Yaamigilina Vaatini Mringinanu
   Vadivadithadabadu Nandhakaarame Vacchina Gunapade Naa Raaju
   ||Kathina||

6. Ghoshapetti Deshamellanedvaga Gumpulugaa Jyeshtulu Chaava
   Roshamutho Ventabadi Nashinchi Doshamukai Duhkhamupadire
   ||Kathina||

7. Nashtamu Kashtamu Kaliginanumari Narulunu Devude Cheppinanunu
   Ishtapadavu Rakshimpabadutakai Irukupadina Nirukuna Jedina
   ||Kathina||

8. Paapaprathaapamu Neruguduvu Daani Shaapamu Thaapamu Nerugu
   Duvaa Paapamu Nokapari Battithivaa Adi Pattubadi Kathinaparachu
   ||Kathina||

9. Lolopalana Nyaayamabaddhamulopamu Kaligina Mosamulo
   Kaalayaapanacheya Nupaayamulaela? Veshadhaaranayaela
   ||Kathina||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------