1020) జీవిత తృష్ణలను నాదు తీర్చుమయ్యా

** TELUGU LYRICS **

    జీవిత తృష్ణలను - నాదు
    తీర్చుమయ్యా ప్రియ - యేసునాథా

1.  నా జీవాధారము నీవే - నీ నుండే జీవము ప్రవహించు
    ప్రవహించే ఈ నీ జీవముతో - ప్రభువా నన్ను నింపుము

2.  నా శాంతిదాతవు నీవే - శాంతము నీనుండే వచ్చునుగా
    నిశ్చలమైన నీ శాంతముతో - నా జీవితమును నింపుము

3.  సత్యానందమును నీవే ప్రభు - అసమానము నీ యానందమేగా
    అత్యానంద భరితునిగాజేసి - నిత్యము నన్ను నింపుము

4.  పరిశుద్ధ జీవానందము - పరిశుద్ధతను నా కొసగితివి
    నిరతము నా జీవితము ద్వారా - లోకమును దీవించుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments