1021) జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?

** TELUGU LYRICS **

    జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?
    ఈ లోకములో జీవించు జీవితమంత
    జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?

1.  శరీరేచ్ఛలకై ఆశలుండు - ఈ ధరణియందు
    సుఖభోగులుగా జీవింతురు - ఈ ధరణియందు
    వారి యూహలు దినమెల్ల చెడియున్నవి
    వారి పాప జీవిత మంత శాపమెగ

2.  ధనాపేక్షకులెందరో గలరు - ఈ ధరణియందు
    ధనముపై మనస్సు నిల్పెదరు - ఈ ధరణియందు
    వారి కలవరమంత ధనము ధనమే
    వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే

3.  స్వంత బోధలకై బ్రతికెదరు - ఈ ధరణియందు
    గర్వమునకు అమ్మబడి యుందురు - ఈ ధరణియందు
    వారి మనసులు సంకుచితములై యుండు
    వారి జీవిత ప్రయాసము - పతనమేగా

4.  విరిగిన హృదయులు కలరెందరో - ఈ ధరణియందు
    కరిగెడు ఉప్పుగ నుండెదరు - ఈ ధరణియందు
    వారు ప్రభుకై దాగియే నిలచెదరు
    దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments