1002) జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను

** TELUGU LYRICS **

    జీవించుచున్నది నేను కాదు
    క్రీస్తుతో నేను సిలువవేయబడినాను
    క్రీస్తే నాలో జీవించుచున్నాడు

1.  నేను నా సొత్తు కానేకాను
    క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను
    నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు
    యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది 
    ||జీవించు||

2.  యుద్ధము నాది కానేకాదు
    యుద్ధము యేసయ్యదే నా పక్షమున
    జయమసలే నాది కానేకాదు
    యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు
    ||జీవించు||

3.  లోకము నాది కానేకాదు
    యాత్రికుడను పరదేశిని
    నాకు నివాసము లేనేలేదు
    యేసయ్య నివాసము నాకిచ్చినాడు
    ||జీవించు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------