** TELUGU LYRICS **
జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుద దీర్చుము
జీవనపథములో చీకటి పడువేళ జీర్ణించు కొనిపోవు జీవితాశలఁ బెంచ
||జీవా||

1. విందుగృహమునకేగి వీక్షింతు భ్రమతో నీ వివిధసుభోజ్యంబులన్
విచ్ఛిన్నమైన నీ విమల దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి,
తినుచుందు
||జీవా||
2. రుధిర ధారలలోన ఋజువౌ నీ ప్రేమలు రూపుమాయును పాపము
ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత ఋణభారములు దీరి రుచి
యించు నా బ్రతుకు

3. భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలియించు యీహోమము
ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణంబౌను ప్రతిరక్త
బిందువు

4. ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన ఆరాధించు నీ నామము
అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును
దేవా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :