968) జనులందఱు వినండి దివ్య సంగతి

** TELUGU LYRICS **

1.  జనులందఱు వినండి
    దివ్య సంగతి
    తండ్రియైన దేవుఁ డెంత
    ప్రేమ చూపెను.
    ||యేసు క్రీస్తు నాకుఁగాను
    బ్రాణ మిచ్చెను
    తన్ను జేర నన్ను బిల్చెన్
    క్రీస్తు వత్తును ||

2.  నరకోటి పాపమందు
    మున్గి యుండఁగాఁ
    దండ్రి వారలన్ రక్షింపఁ
    ద్రోవ చేసెను.

3.  మాకుఁ గాను ప్రాణమిచ్చి
    మృత్యు వొందను
    తన యేక పుత్రు నిచ్చి
    పంపె నిలకున్.

4.  ఆయనను నమ్మువారు
    నాశ మొందక
    నిత్యజీవ మొందిసదా
    సంతసింతురు.

5.  పాపభారము భరించు
    పాపులెల్లరు
    యేసు మాట వినఁగాను
    బాధ తీఱును.

6.  చేర రండి సువిశ్రాంతి
    నిత్యసంతుష్టి
    మీకు నిత్తు నంచు యేసు
    మిమ్ముఁ బిల్చును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------