865) ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్

** TELUGU LYRICS **

    ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్ (2)
    జనులారా స్తోత్రించి ముద్దులాడుడి 
(2)

1.  పాడుడి మళ్ళి పాడుడీ 
(2)
    పాపుల విమోచకుడు 
    ప్రభు యేసు రక్షకుడు (2)  
    నేడుద్భవించెను బెత్లెహేమున (2)
    ||ఘన||  

2.  తట్టుడి కేలు తట్టుడీ (2)
    తండ్రియగు దేవుడిచ్చె 
    తన యొక్క ముద్దు పాపన్ (2) 
    నిట్టూర్పులింకేల పాపలోకమా (2)
    ||ఘన||  

3.  చుట్టుడి ప్రేమన్ చుట్టుడీ (2)
    తొట్టిలోన బట్టతోను 
    చుట్టబడ్డ యేసు పట్టిన్ 
(2) 
    గట్టిగాను పాదసేవ జేయుడి (2)
    ||ఘన||  

4.  దేవుడే తానైననూ (2)  
    దాస్యంపు రూపమును దాల్చుకొన్న 
    యేసునాధున్ 
(2)
    విశ్వాస ప్రేమతోను బట్టుమా (2) 
    ||ఘన||  

5.  హీనమైన దాసుడా! (2) 
    మానవుని ఘనపర్చ దీనుడాయె 
    ఘన యేసు (2) 
    ప్రాణంబులన్ గూడ ప్రభుకర్పించు (2)
    ||ఘన||  

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------