** TELUGU LYRICS **
ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్
ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖము
లొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు

||ఘనదేవ||
1. అధిక ప్రేమలొసఁగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరము
ప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకుఁ జేర్చితి
ప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక
||ఘనదేవ||
2. అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్
మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతోఁ గావు మిలను చంచలులు
గాకుండ నీ కృప లుంచి మము రక్షించుమో ప్రభు

3. దీవించు ప్రభుయేసువా సువార్తికులన్ సావధానముగా భువిలో
భావమందున నీపదంబుల సేవ బాగుగఁ జేయుచున్ నీ జీవజల
వాక్యంబులన్ ధర ధీరతనుఁ బ్రకటింపఁ జేయుము

4. పరముండ ధర నీ సభలన్ నూతనముగ స్థిరపర్చి బలపర్చుము
సరసముగ నాశీర్వచనము ల్విరివిగా నొసంగుచున్ నూ తన సహోదర
ప్రియుల సమితిని మరియుఁ జేర్చుము నీ సభలలో

5. కరుణాళ యీవత్సరము క్రైస్తవ బడుల ధరణిబ్రబలఁ జేయుమా
సరిగ నుపాధ్యాయులందరి మరి మరీ దీవించు ప్రభువా స్థిరముగా
పరమార్ధములు బా లురకు గరవుచునుండఁ జేయుము

6. భాసురంబుగ పరలోక ప్రకాశుఁడా దాసబృందములన్ గావు వాసిగా
నరలోకము నని వాసులగు మీ దాసులందరి దోషరాసిని ద్రోసి నీ కృప
జూపుచును రక్షించు మనిశము

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :