1160) దివ్య యేసు మీద నానుకొందుము

** TELUGU LYRICS **

1.  దేవసమాధానం శాంతివలె
    ప్రవహించుచుండు వరదరీతి
    మెండుగాను పారుచుండు నిత్యము
    నిండులోతుగాను వృద్ధియగును
    
    పల్లవి: దివ్య యేసు మీద నానుకొందుము
    నిత్య విశ్రాంతిని పొందియుందుము

2.  చేతినీడ క్రింద నన్ను దాచెను
    శత్రుభయముచే దిగులొందను
    కాపాడును చంచలము రానీక
    కించిత్తేని దుఃఖ పడనీయడు

3.  నీడవలెనుండు దుఃఖక్లేశమున్
    సూర్యజ్యోతియైన తన కృపచే
    పారద్రోలి నిత్యానంద మిచ్చును
    కాన జీవితము సఫలమగున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------