1153) దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా

** TELUGU LYRICS **

    దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా మమ్ము కనిపెట్టి కాపాడ
    నెపుడు కర్త వీవే కర్త వీవే 
    ||దినదినమునకు||

1.  పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతోఁ
    గావు మమ్ముఁ గావు మమ్ము
    ||దినదినమునకు||

2.  పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ముఁ భట్టి రక్షింప వచ్చినఁ
    బ్రాపు నీవే ప్రాపు నీవే
    ||దినదినమునకు||

3.  కష్టములు కాని శోధనలు మమ్ముఁ జుట్టు కొనఁగ నీ కృపనెంతో
    చూపుదువే చూపుదువే
    ||దినదినమునకు||

4.  నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందఁబోవు కాలమందుఁ
    దండ్రి వీవే తండ్రి వీవే
    ||దినదినమునకు||

5.  సత్యమైన వాక్య మిచ్చి సారమును దెల్పి నీదు నిత్యజీవ మార్గ మందు
    నిలిపితివే నిలిపితివే
    ||దినదినమునకు||

6.  ఆసఁ గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు దాసులపై
    బ్రతుకునట్లు ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము 
    ||దినదినమునకు||

7.  విశ్వాస నిరీక్షణ ప్రేమ లింపుగా మాకు నీవు శాశ్వతముగఁ బంపించుమీ
    శ్రేష్టముగను శ్రేష్ఠముగను
    ||దినదినమునకు||

** ENGLISH LYRICS **

Dina Dinamunaku Dikku Neeve Maa Devudaa Mammu Kanipetti Kaapaada
Nepudu Karthaveeve Karthaveeve
||Dina Dinamunaku||

1. Panikimalina Vaaramu Paapishthulamu Needu Kanikaramunu Joochi Krupatho
Gaavu Mammu Gaavu Mammu
||Dina Dinamunaku||

2. Paapamaina Lokamaina Pishaachakamaina Mammu Bhatti Rakshimpa Vachchina
Braapu Neeve Braapu Neeve
||Dina Dinamunaku||

3. Kashtamulu Kaani Shodhanalu Mammu Juttu Konaga Nee Krupanentho
Choopuduve Choopuduve
||Dina Dinamunaku||

4. Nindhalaina Debbalaina Needu Naamamuna Memu Pondabovu Kaalamandhu
Thandri Veeve Thandri Veeve
||Dina Dinamunaku||

5. Sathyamaina Vaakyamichchi Saaramunu Delpi Needu Nithyajeeva Maargamandhu
Nilipithive Nilipithive
||Dina Dinamunaku||

6. Aasa Golpi Aathmalo Naakyanubhava Mondhinchi Neeku Daasulapai
Brathukunatlu Dhairya Mimmu Dhairya Mimmu
||Dina Dinamunaku||

7. Vishwaasa Nireekshana Prema Limpugaa Maaku Neevu Shaashwathamuga Bampinchumee
Shreshthamuganu Shreshthamuganu
||Dina Dinamunaku||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post