1129) ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే

** TELUGU LYRICS **

    ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే చిత్తమా ధ్యానించ
    వాసక్తి జ్ఞానంబుఁ గలిగించు జ్ఞాన స్వరూపుఁడు జ్ఞానాత్మచే నీకు
    ||ధ్యానింపవే||

1.  అరయ నీ తలఁపుల నఘము లగుపడు నీకుఁ పరిశుద్ధుఁ డీక్షింప
    బహుగా గనుపడుచుండు 
    ||ధ్యానింపవే||

2.  పరికింపఁ బలుకులఁ పాప మగుపడు నీకు పరిశుద్ధుఁ డరయుఁ గ
    న్పడకుండు నే యది
    ||ధ్యానింపవే||

3.  క్రియలను జింతింప మయిల గనపడు గాన భయ మొంది నమ్మికను
    బదవే క్రీస్తుని దరికి
    ||ధ్యానింపవే||

4.  దేవుని ఘన ప్రేమ దినదినముఁ దలపోయ నీవు పొందఁగ వచ్చు
    నిక్కమైన శుద్ధి
    ||ధ్యానింపవే||

5.  స్మరియింప నీలోన వర రక్షకుని పాట్లు భరియింప నోపుదువె పాప
    మొక నిమిషంబు
    ||ధ్యానింపవే||

6.  హృదయంబు విమలాత్మ సదనంబుఁ గావింపఁ పదవే శ్రీఘ్రంబుగఁ
    పరమ జనకుని కడకు
    ||ధ్యానింపవే||

7.  దేవుని సేవింపఁ దిరముగ నాశించి దేవాత్మ కొర కీవు దినము
    దేవుని వేఁడ
    ||ధ్యానింపవే||

** ENGLISH LYRICS **

Dhyanimpa Ve Chitthama Varshaanthamuna Dhyanimpane Chitthama
Dhyanincha Vaasakthi Jyaanambu Galiginchu Jyaana Swaroopudu Jyaanaathmache Neeku
||Dhyanimpave||

1. Araya Nee Thalapula Naghamu Lagupadu Neeku Parishuddudu Eekshimpa
Bahugaa Ganupaduchundu
||Dhyanimpave||

2. Parikimpa Balukula Paapa Magupadu Neeku Parishuddudu Arayu
Ganpadukundu Ne Yadhi
||Dhyanimpave||

3. Kriyalanu Chinthimpa Mayila Ganapadu Gaana Bhaya Mondhi Nammikanu
Padhave Kreestuni Dhariki
||Dhyanimpave||

4. Devuni Ghana Prema Dinadhinamu Thalapoya Neevu Pondhaga Vachchu
Nikkamaina Shuddhi
||Dhyanimpave||

5. Smariyimpa Neelona Vara Rakshakuni Paatlu Bhariyimpa Nopudhuve Paapa
Moka Nimishambu
||Dhyanimpave||

6. Hrudayambu Vimalaathma Sadhanambu Gaavimpa Padhave Shreeghrambuga
Parama Janakuni Kadaku
||Dhyanimpave||

7. Devuni Sevimpa Thiramuga Naashinchi Devaathma Kora Keevu Dinamu
Devuni Veda
||Dhyanimpave||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------