1190) దేవర బ్రోవుమా దీన కుటుంబమున్

** TELUGU LYRICS **

    దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన లొసగుచు ధాత్రిని
    నడుపుమా 
    ||దేవర||

1.  పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ
    ||దేవర||

2.  యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున
    నిలువుమ
    ||దేవర||

3.  అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ
    ||దేవర||

4.  పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున
    గావుమ
    ||దేవర||

5.  అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను
    గొలుతుము దేవ
    ||దేవర||

6.  నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము
    ||దేవర||

7.  క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ
    ||దేవర||

** ENGLISH LYRICS **

Devara Brovuma Deena Kutumbamun Deevena Losaguchu Dhaathrini Nadupumaa
||Devara||

1. Paavanamagu Swa Bhavamu Nimmaa Paalincharu Maa Paalitidhaivama
||Devara||

2. Yesu Prabhuva Maa Intiki Shirasupai Vaasamujeyu Maa Yanduna Niluvuma
||Devara||

3. Anudhina Bhojanam Banugrahinchi Maa Panipaatulalo Prakkanu Niluvuma
||Devara||

4. Pillala Peddhalan Benchuma Prematho Nella Samayamula Yanduna Gaavuma
||Devara||

5. Anakuva Thyaagamu Nathidhi Sathyaaryamul Ganut hinchuchu Ninu Goluthumu Deva
||Devara||

6. Nee Parishuddhatha Nerpumu Yesuva Kaapari Veevai Kaayumu Mammu
||Devara||

7. Kraisthava Jeevamu Kramamuga Nondhuchu Prasthuthinthumo Prabhuvaa Brovuma
||Devara||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------