** TELUGU LYRICS **
దేవా నన్నేల విడిచినావయా
దేవా నన్నేల మరిచినావయాదీనుడను నేను దిక్కులేని వాడను
దయచూపి ఆదుకొనుమయా
అల్పుడను నేను అనాదను నేను
దరిచేరి ఆదరించుమయా
దేవా.. నా దేవా
నా యేసయ్యా
ఎన్నో ఆశలతో జీవించుచుండగా
అంతా నా వారేనని నమ్మియుండగా
ప్రేమించినవారే నను మోసగించి
నే నమ్మినవారే నా చేయి విడిచి
ఒంటరిగా చీకటిలో నిలిచియుంటిని
నా జీవితం సుడిగుండాల వలయం
ఊహించని మలుపులే నిత్య ప్రాప్తం
అనుకున్నవి జరగకా అనుకోనివి జరుగుతు
అందరు విడిచిన అనాదనైతిని
చావలేక బ్రతకలేక కుములుచుంటిని
దేవా నీకై జీవింతును
నా దేవ నీకై సాక్షినౌదును
దయ చూపి ఆదుకొనుమయా
దేవా నీకై జీవింతును
నా దేవ నీకై సాక్షినౌదును
చేయి చాపి ఆదరించుమయా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------