** TELUGU LYRICS **
దేవా నాదేవా నన్నేల విడచితివని
సిలువలో బలియైన నా యేసువా
పలుబాధ లొందితివి నా శైలమా
సిలువలో బలియైన నా యేసువా
పలుబాధ లొందితివి నా శైలమా
1. నా తండ్రి నీకిది సాధ్యమైతే
ఈ గిన్నె నానుండి తొలగింపుమని
నా నాథా తండ్రిని వేడితివా
నే మోయలేని ఈ భారమంత
నీవు గాక యెవరు భరింతురు
ఈ గిన్నె నానుండి తొలగింపుమని
నా నాథా తండ్రిని వేడితివా
నే మోయలేని ఈ భారమంత
నీవు గాక యెవరు భరింతురు
2. నీ శిష్యులంతా యేమైపోయిరి
నీవు స్వస్థపరచిన రోగులేరి
నీ తండ్రికూడా నిను విడనాడెనా
నా దోషమంతా నీపై మోపెనా
నిను నలుగగొట్టుట కప్పగించెనా
నీవు స్వస్థపరచిన రోగులేరి
నీ తండ్రికూడా నిను విడనాడెనా
నా దోషమంతా నీపై మోపెనా
నిను నలుగగొట్టుట కప్పగించెనా
3. నిన్ను రచ్చకీడ్చను నా రక్షకా
నీ నేరమేమిటి ఓ నా ప్రభువా
మానవులు దేవుని చంపుటయా?
ఏ చరితంబులోనూ కలదా ప్రభూ?
ఈ ఘోరమరణము నాకై నొందితివా?
నీ నేరమేమిటి ఓ నా ప్రభువా
మానవులు దేవుని చంపుటయా?
ఏ చరితంబులోనూ కలదా ప్రభూ?
ఈ ఘోరమరణము నాకై నొందితివా?
4. సొగసైన షారోను ఓ పుష్పమా
సురూపమంతా కోల్పోయితివా
వ్యసనా క్రాంతుడవైతివా నాకై
వ్యాధిని అనుభవించితివి నాకై
వధియింప బడితివి బలి పశువుగా
సురూపమంతా కోల్పోయితివా
వ్యసనా క్రాంతుడవైతివా నాకై
వ్యాధిని అనుభవించితివి నాకై
వధియింప బడితివి బలి పశువుగా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------