** TELUGU LYRICS **
చూడుము గెత్సెమనె - తోటలో నా ప్రియుడు
పాపి నాకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది
పాపి నాకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది
1. దేహమంతయు నలిగి - శోకము నొందినవాడై
దేవాది దేవుని ఏకసుతుడు పడు - వేదనలు నా కొరకే
||చూడుము||
2. తండ్రి యీ పాత్ర తొలగన్ - నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు - నన్నప్పగించితివనెను
||చూడుము||
||చూడుము||
3. రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు హృదయము పగులగ - విజ్ఞాపనము జేసెనే
||చూడుము||
||చూడుము||
4. ముమ్మారు భూమి మీద - పడి మిక్కిలి వేదనచే - మన
యేసు ప్రభువు తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే
||చూడుము||
5. ప్రేమతో కూడిన వాక్కులచే - ఆదరించెడి ప్రభువు
వేదన సమయమున ఆదరించువారు - లేక బాధనొందెను
||చూడుము||
6. నన్ను తన వలె మార్చెడి - ఈ మహా ప్రేమను
తలచి తలచి హృదయము కరుగగా - నే సదా కీర్తించెదను
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------