937) చూడుము సోదరుడా నీవు నేడే లేచి

** TELUGU LYRICS **

    చూడుము సోదరుడా నీవు - నేడే లేచి రక్షణ కొరకై
    వేడుము స్నేహితుడా

1.  లెమ్ము నీకు వెలుగువచ్చెను - కమ్ముచున్నది చీకటి లోకమున్
    చిమ్మచీకటి జనముల గమ్మెను - నెమ్మది నొందగ లేచి రా
    నమ్ముము సోదరుడా

2.  దేవుని వాక్యము వెలుగైయున్నది - ఆ వెలుగే నీకు జీవమైయున్నది
    నీ వెనుకే ఆ జీవము నిలచెను - జీవము నొందగ వేగమే రా
    రావో సోదరుడా

3.  నిలువుము నీ జీవము ఆవిరియే - ఇలలో లేదిక నీదని చెప్పెడు
    కలుషము లెల్లను కడుగును క్రీస్తు నిలుచును ఇల నీ కాపరియై
    కలువరి చెంతకు రా

4.  మొర్రపెట్టుము నేడే లేచి - సరిచేసికొని జీవితమంత
    పరిశుద్ధ రక్తధారలతో - పరిశుద్ధుడు నిలచెను నీకై
    పరుగిడిరా ప్రియుడా

5.  యేసుని నమ్మెడి వారిలలోన - యేసుని జీవము పొందిన వారై
    భాసురంబుగా మోక్షము జేర - నిల్చెదరు శక్తిని బొంది
    యేసే ఒసగును రా

6.  హల్లెలూయ పాడుము నేడే - వల్లభుండేసు వచ్చునని
    ఎల్ల ప్రజలు చూచెద రేసున్ - చల్లని ప్రభూరాకన్ ఇలలో
    స్తుతులను పాడను రా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------