** TELUGU LYRICS **
1. కల్వరి గుట్టమీదను - దుర్మార్గవైరులు
ద్వేషించి సిల్వ మీదను - శ్రీ యేసుజంపిరి
ద్వేషించి సిల్వ మీదను - శ్రీ యేసుజంపిరి
2. శ్రీయేసు శ్రమలన్నియు - నే నెంచజాలను
నన్నున్ రక్షించులాగున - ప్రాణంబు బెట్టెను
నన్నున్ రక్షించులాగున - ప్రాణంబు బెట్టెను
3. నే జీవ మొందులాగున - చావును పొందెను
నన్నున్ రక్షింప శ్రమను - శ్రీ యేసు పొందెను
నన్నున్ రక్షింప శ్రమను - శ్రీ యేసు పొందెను
4. శ్రీ యేసు గాక గురువు - లేరింక నాకును
నా వంటి పాపులెల్లరిన్ - రక్షింప వచ్చెను
నా వంటి పాపులెల్లరిన్ - రక్షింప వచ్చెను
5. నా యేసు ప్రేమగొప్పది - యమూల్యమైనది
నే ప్రేమతోను యేసును - సేవింతు నిత్యము
నే ప్రేమతోను యేసును - సేవింతు నిత్యము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------