** TELUGU LYRICS **
1. ఆయన నన్ను నడుపునను - ఆలోచనే నా కాధారం
నే నేమిచేసిన నెట్లున్నన్ - దేవునిచేయి నన్నడుపును
పల్లవి: ఆయనే నన్ను నడిపించున్
నే నేమిచేసిన నెట్లున్నన్ - దేవునిచేయి నన్నడుపును
పల్లవి: ఆయనే నన్ను నడిపించున్
తన స్వంత చేతితో నడిపించున్
విశ్వాసముతో తన వెంబడి నే
వెళ్ళెద నన్ను నడుపును
విశ్వాసముతో తన వెంబడి నే
వెళ్ళెద నన్ను నడుపును
2. ఒకనాడు చిమ్మ చీకటిలో - మరునాడు పూలపొదరింట
విశ్రాంతిలో కలతలలో నన్ - దేవుని హస్తమే నన్నడుపున్
3. సణుగు గొణుగుల మాని నీ - చేయి పట్టుకొనెద నా ప్రభో
సదా సంతృప్తితో యుండెద - దేవుని హస్తమే నన్నడుపున్
4. భువిలోన నా పని కాగానే - నీ కృపచే జయమరయగనే
చావునకైన భయపడను - యోర్దాను ద్వారా నడిపెదవు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------