** TELUGU LYRICS **
ఆనందమగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు
దాని సుందరము
దాని సుందరము
||ఆనందమగు||
1. పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు
చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ
డి పరితృప్తి నుండు
||ఆనందమగు||
2. బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న
న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల
నమృతుఁడ నెపుడు

3. ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ
ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి
భువి యందె గాంతు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :