5796) వర్ణింపతరమా నిన్ను నేను యేసువా పాడతరమా

** TELUGU LYRICS **

వర్ణింపతరమా నిన్ను నేను యేసువా 
పాడతరమా నీదు కృపను యేసువా (2)
నీ కౌగిట చేరు కొనుటకై ఆశించితి ప్రాణనాథుడ 
నీ స్వరమును నిరాతం వినుటకై ఆశించితి ఆత్మనాథుడ 
కృపకు మూలము నీవెగా (2)

సిలువను నే చూడగా నిండెను కృతజ్ఞతా (2)
కనులు నిండే భాష్పములతో నోరు నిండే స్తోత్రములతో
ఆత్మ రక్షణ నాకోసగ బలియైతివే నీ యెదుట నిలిచెదా నా సర్వం ఇచ్చేద
కరుణా సాగరా నీవెగా (2)

నీ వాక్కును నే చూడగా నా భాగ్యము కనుగొంటిని (2)
నీదు సుతగా శ్రేష్ట స్థితిని సంతసంబగు స్వర్గ స్థితిని 
దానముగా నీ కృప వరములను పొందితి నీ ఆత్మ శక్తితో జీవింతును సాక్షిగా 
మహిమ ప్రభుడవు నీవెగా (2)

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics,Tune : Pastor Samuel Wilson
Telugu Lyrics : Jeeva R. Pakerla
Vocals & Music : Nithya Mammen & Jonah Samuel
--------------------------------------------------------------------------------