5791) సమీపించరాని తేజస్సులోన నివసించు నా యేసయ్యా

** TELUGU LYRICS **

సమీపించరాని తేజస్సులోన నివసించు నా యేసయ్యా
నా సమీపమున చేరి నాతో ఉండుటకు నీ మహిమనే విడచిన నా దేవా (2)
నా యేసయ్యా నీదు సిలువ యాగమే 
నను శుద్ధినిగా చేసి నిలబెట్టేనే 
నా యేసయ్యా నీదు ప్రాణ త్యాగమే 
నిత్య జీవమునకు అర్హునిగా నను చేసేనే (2)

గమ్యమే లేని బాటసారిని లోక యాత్రలో నే తిరుగుచుంటిని (2)
నీ చిత్తములో ఏర్పరచితివే
కుమారునిగా స్వీకరించితివే (2)
నా యేసయ్యా నీదు సిలువ యాగమే 
నను శుద్ధినిగా చేసి నిలబెట్టేనే 
నా యేసయ్యా నీదు ప్రాణ త్యాగమే 
నిత్య జీవమునకు అర్హునిగా నను చేసేనే (2)

నిందలే నను చుట్టిముట్టిన 
(ఈ) లోకమే తృణీకరించినా (2)
నీ రక్షణనే ప్రకటించెదను 
నీ సాక్షిగా నే జీవించెదను (2)
నా యేసయ్యా నీదు సిలువ యాగమే 
నను శుద్ధినిగా చేసి నిలబెట్టేనే 
నా యేసయ్యా నీదు ప్రాణ త్యాగమే 
నిత్య జీవమునకు అర్హునిగా నను చేసేనే (2)

--------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics, Tune, Vocals : Tarun J
--------------------------------------------------