5838) ప్రాణం నీవేనయ్యా నా సర్వం నీవేనయ్యా

** TELUGU LYRICS **

ప్రాణం నీవేనయ్యా నా సర్వం నీవేనయ్యా
నా దైవమా నా ధైర్యమా నా బంధూబలగం నీవెగా
నా జీవమా నా మార్గమా నా త్రోవకు దీపం నీవెగా
          
నువు మాత్రం లేకుంటే మన్నుకుమన్నై పోదునూ
నిన్నైనా నేడైనా రేపైనా ఎపుడైనా 
నీ కృపవలనే జీవిస్తున్నానయ్యా
నీ స్నేహము పొందానూ 
నిన్నే స్మరియించానూ
నే విన్నా నేనున్నా నీమనసే నే కన్నా 
అని పేరుపెట్టి పిలిచావయా
    
ప్రతి నిమిషం నీవెంటే అడుగులో అడుగై నడిచెదనూ 
ఏమున్నా లేకున్నా కలిమైనా కరువైనా
నివు వుంటే భయమేలేదయ్యా
నా సర్వము విడిచానూ
నిన్నే నమ్ముకున్నానూ 
చావైనా బ్రతుకైనా నీతోనే అనుకున్నా 
నను చేయిపట్టి నడిపించయ్యా

-----------------------------------------------------
CREDITS : Music : Mahi Madhan
Lyrics, Tune : Bro.Philliph Prakash
Vocals : Sis. Jessi
-----------------------------------------------------