** TELUGU LYRICS **
మరువనిది నీ ప్రేమ
విడువనిది నీ కృప
ఎడబాయనిది నీ వాత్సల్యము
స్థిరమైనవి నీ తలంపులు
అ.ప : ఘనుడా నిన్ను ఘనపరతును
నా జీవమున్నంతవరకు
ప్రియుడా నిన్ను ప్రణుతింతును
నా ప్రాణం ఉన్నంత వరకు
విడువనిది నీ కృప
ఎడబాయనిది నీ వాత్సల్యము
స్థిరమైనవి నీ తలంపులు
అ.ప : ఘనుడా నిన్ను ఘనపరతును
నా జీవమున్నంతవరకు
ప్రియుడా నిన్ను ప్రణుతింతును
నా ప్రాణం ఉన్నంత వరకు
అపజయ ధ్వనులే నా చుట్టూ మ్రోగగా
నిరీక్షణ లేని నిశిధి వేళలో
అజేయుడా! నీ ఆదరణతో నింపి
అనంత కృపతో నన్ను స్థిరపరిచినావు
||ఘనుడా||
గమ్యమే యెరుగక కలత చెందగా
ప్రయాణమే భారమైన వేళయందున
విజేయుడా! నీ విజయానందముతో
నడిపించినావు నూతన మార్గమున
||ఘనుడా||
భీకర ధ్వని గల ఎడారిలో నేనుండగా
ఆధారమే లేక కృంగిన వేళలో
శ్రీమంతుడా! నీ ప్రేమ మాధుర్యము
నింపెను నాలో నూతన ఉత్తేజం
||ఘనుడా||
----------------------------------------
CREDITS : Music : K. Elia
Vocals : Surya Prakash
----------------------------------------