** TELUGU LYRICS **
ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి
యూదుల రాజులలో నా యేసు మేటి (2)
అందుకే నా యేసు పేరు వింటే
హేరోదు రాజు కే దడ దడ
యేరుషలేము ప్రజలకే దడ దడ (2)
||ఖండాంతరాలే||
యూదుల రాజులలో నా యేసు మేటి (2)
అందుకే నా యేసు పేరు వింటే
హేరోదు రాజు కే దడ దడ
యేరుషలేము ప్రజలకే దడ దడ (2)
||ఖండాంతరాలే||
నా యేసు జననం శాస్త్రానికి వింత
నా యేసు మరణం లోకానికి చింత.. ఆ... ఆ.. (2)
కాలానికి మధ్యవర్తి నా క్రీస్తు రా
చరిత్ర పుటలకేక్కిన శకపురుషుడు రా (2)
||ఖండాంతరాలే||
నా యేసు రాజ్యం పరలోక రాజ్యం
నా యేసు పాలన దైవ గ్రంథ పాలన.. ఆ... ఆ.. (2)
ప్రపంచ రాజుల నే తలదన్నే పాలన అంతమే లేనిదై నిలుచు పాలన
ప్రపంచ రాజుల నే తలదన్నే పాలన
అంతమే లేనిదై యుగ యుగాలు నిలుచు పాలన
||ఖండాంతరాలే||
అంతమే లేనిదై యుగ యుగాలు నిలుచు పాలన
||ఖండాంతరాలే||
నా యేసు క్రీస్తు పుట్టుకతో రాజు
నా యేసు క్రీస్తు విశ్వానికే రాజు (2)
పరలోకమందుఅయినా భూమియందు అయినా
యేసు నామమున మోకరిల్లి రా
లోకమందు ప్రతి నాలుక నా యేసు నామమును
ఒప్పుకొని రక్షణే పొందాలి రా!
యేసు నామమున మోకరిల్లి రా
లోకమందు ప్రతి నాలుక నా యేసు నామమును
ఒప్పుకొని రక్షణే పొందాలి రా!
-----------------------------------------------
CREDITS : Lyrics : David Raju
Vocals : Revanth
-----------------------------------------------