5873) కలవరమెందుకు కలత చెందకు వేదనలెన్నైనా శోదనలెదురైనా

** TELUGU LYRICS **

కలవరమెందుకు కలత చెందకు
వేదనలెన్నైనా శోదనలెదురైనా
సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ

శూన్యములో ఈ సృష్టిని
తననోటి మాటతో సృజియించినా
యేసయ్యా నీతో ఉన్నాడులే 
యేసయ్యా నీతో ఉంటాడులే    

అలలహోరులో పెనుగాలివీచినా
వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో   

అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా
సింహాల మద్యన నీవుండినా 

ఆకాశపు వాకిళ్ళుతెరచి
పట్టజాలని దీవెనలొసగే 

-----------------------------------------------------
CREDITS : Music : JK Christopher 
Lyrics : Ps. K.Solomon Raju
Tune, Music : G.Daya Babu
-----------------------------------------------------