5826) గౌరవనీయుడా గలిలయవాడా యేసయ్య నిన్ను ఘనపరచెదనయ్యా

** TELUGU LYRICS **

గౌరవనీయుడా గలిలయవాడా యేసయ్య 
నిన్ను ఘనపరచెదనయ్యా (2)
గీతము రాసి రాగము కూర్చి గానము చేసి నిన్ను స్తుతించి (2)
ఆశ తీర ఆరాధింతునయా నా యేసయ్యా ఆత్మలో ఆనందింతునయా
||గౌరవనీయుడా||

ఎంచి చూస్తే ఏ మంచి లేదు నాలో
తుంచి వేయాలనే వంచనతో (2)
సాతాను నా వైపు ముంచుకొని రాగా
కంచె వేసి నాపై కరుణ చూపినావు (2)
||ఆశ తీర||

పచ్చి మాంసం తినే సింహం కాకి మత్స్యము
నీ మాట చొనెరవేర్చాయి (2)
పితరుల మీద నీ ప్రేమ నిలిపి
వారిని సహితము పదిలపరచినావు (2)
||ఆశ తీర||

---------------------------------------------------------------------------------------
CREDITS : Music : JK Christopher 
Lyrics & Vocals : John Sandeep & Sireesha Bhagavathula
--------------------------------------------------------------------------------------