** TELUGU LYRICS **
స్తుతియింతును నీ నామం - ప్రభువా నే ననుక్షణం
ధ్యానింతును నీ వాక్యం - హృదయములో నిరంతరం
నీవే నా ఆధారం - నీవే నా ఆశ్రయము
నీవే నా ఆనందం - ప్రభు నీవే నా సమస్తము
ధ్యానింతును నీ వాక్యం - హృదయములో నిరంతరం
నీవే నా ఆధారం - నీవే నా ఆశ్రయము
నీవే నా ఆనందం - ప్రభు నీవే నా సమస్తము
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
అపాయమేమియు రాకుండగా నను కాచి నడిపితివి
నీవే నా అతిశయము - నా కోట నా బలము
నీవే రక్షణశృంగము - నా కేడెము నా శైలఘు
ఒంటరిగా ఏ తోడులేక అలసియుంటిని
నీ ప్రేమ చూపి నన్నాదరించి థైర్యపరచితివి
నీ ప్రేమ మరువనిదీ - అది ఎన్నడు మారనిది
నీ ప్రేమ వీడనిది - అది శాశ్వత మైనది
మరణపువ్యాథులు నన్నావరించి కృంగదీసిన
నీ కరుణ చూపి నను స్వస్తపరచి జీవమిచ్చితివి
నీవే నా వైద్యుడవు - వైద్యులకే వైద్యుడవు
నీవే సజీవుడవు - నిజమైన దేవుడవు
------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Suresh Nittala
Music : Dr JK Christopher
Vocals : Sharon Philip, Lillian Christopher, Hana Joyce
-----------------------------------------------------------------------------------