5713) నా ప్రాణమా నా ప్రాణమా నా సర్వమా

** TELUGU LYRICS **

నా ప్రాణమా నా ప్రాణమా 
నా సర్వమా... ఆ... ఆ...
నా జీవమా (2)

ఏ దారి లేని నాకు - నీ దారి చూపావు 
యోగ్యతే లేని నన్ను నీవు ఎంచుకున్నావు 
ఓ ప్రేమ సాగరా సాగిపోదు నీ సేవలో 
ఓ కరుణ సాగరా సాగిపోదు నీ నీడలో
||నా ప్రాణమా||

మట్టినయిన నాకు నీవు నీ మహిమ చూపావు
నీ మహిమతోనే నింపి నీ పనిలో ఉంచావు 
ఓ ప్రేమ సాగరా సాగిపోదు నీ సేవలో   
ఓ కరుణ సాగరా సాగిపోదు నీ నీడలో
||నా ప్రాణమా||

ఈ లోక ఆశలతోనే నే నిండియుండగా 
నా ఆశ నీవుగా మార్చి నీలోకి చేర్చినావు
ఓ ప్రేమ సాగరా సాగిపోదు నీ సేవలో
ఓ కరుణ సాగరా సాగిపోదు నీ నీడలో
||నా ప్రాణమా||

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. Prabhu Kiran Garu
Music & Vocals : Bro.Suneel & Bro. Samuel Paul
----------------------------------------------------------------------------