** TELUGU LYRICS **
నా కన్నుల్లో కదిలేను నీ రూపము ప్రతి క్షణము
నా యెదలో మెదిలెను నీ త్యాగము ప్రతి దినము
మరచిపోనిది నీ రూపము మరువలేనిది నీ త్యాగము (2)
||నా కన్నుల్లో||
నడువలేక నీలువలేక నడచినావ నా యేసయ్యా (2)
ఒక్కమాట నీవు పలుకలేక కదలితివ ఓ కరుణామయ్యా
యేరుషలేము ఆ వీదులల్లొ యేలనయ్యా
ఆ ఘోరబాధ నిన్ను చూడగా నా గుండె చెదిరెనయ్యా
నిన్ను చేరగా నా మనస్సు విరిగెనయ్యా
యేసయ్యా యేసయ్యా విడువజాలనయ్యా నిన్ను మరువజాలనయ్యా
ఎన్నో ఎన్నో శ్రమలకు ఓర్చి ఎంతో ఎంతో బాధభరించి (2)
భారమైన నా సిలువమోసి బలియైతివా
నా స్థానములో కలువరిలో ఆ సిలువపైన వ్రేలాడెన
నీ దేహమంత నిన్ను చూడగా నా గుండె చెదిరెనయ్యా
నిన్ను చేరగా నా మనస్సు విరిగెనయ్యా
యేసయ్యా యేసయ్యా విడువజాలనయ్యా నిన్ను మరువజాలనయ్యా
------------------------------------------------
CREDITS : Vocals : Dinesh
Music : JK Christopher
Lyrics, Tune : Pst Israel Garu
------------------------------------------------