** TELUGU LYRICS **
ఎన్నో మేలులను - ఎన్నెన్నో దీవెనలు
ఎన్నో ఆశీర్వాదములు - ఎన్నెన్నో ఈవులను (2)
ఉచితముగా మా కొసగిన మంచిదేవుడవు(2)
నిండు మనస్సుతో మీకే స్తుతి అర్పింతుము (2)
అ.ప : హల్లెలూయ పాటలతో నిన్ను కీర్తింతుము (2)
స్తుతిగానములతో నిన్ను ఘనపరచెదము (2)
ఎన్నో ఆశీర్వాదములు - ఎన్నెన్నో ఈవులను (2)
ఉచితముగా మా కొసగిన మంచిదేవుడవు(2)
నిండు మనస్సుతో మీకే స్తుతి అర్పింతుము (2)
అ.ప : హల్లెలూయ పాటలతో నిన్ను కీర్తింతుము (2)
స్తుతిగానములతో నిన్ను ఘనపరచెదము (2)
విరిగిన హృదయానికి ఆప్తుడవు నీవయ్య
నలిగిన మనసుకు ఆశ్రయుడవు నీవయ్య (2)
మా ప్రాణమునకు ఆదరణ నీవయ్య
మా గానమునకు యోగ్యుడవు నీవయ్య
హల్లెలూయ పాటలతో నిన్ను కీర్తింతుము (2)
స్తుతిగానములతో నిన్ను ఘనపరచెదము (2)
మేలుతో మా బ్రతుకులను తృప్తిపరచిన దేవడవయ్య
నీలో నిత్యము ఆనందించే కృపను మాకు ఇచ్చితివయ్యా (2)
మారని దేవుడవు మహాత్యముగల దేవుడవని (2)
కృతజ్ఞత స్తుతులతో నిన్నే ఆరాధింతుము (2)
హల్లెలూయ పాటలతో నిన్ను కీర్తింతుము (2)
స్తుతిగానములతో నిన్ను ఘనపరచెదము (2)
ఎండిన నదులన్నిటిని జీవనదులుగా చేసెదవు
ఎడారిలో కస్తూరి పూలను పూయింప చేసే సమర్ధుడవు (2)
నీ ఉపదేశములన్నీ మాకు జీవపు ఊటలుగా (2)
నీ మార్గములన్ని పరలోకానికి బాటలుగా (2)
హల్లెలూయ పాటలతో నిన్ను కీర్తింతుము (2)
స్తుతిగానములతో నిన్ను ఘనపరచెదము (2)
---------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : K S Daniel
Music : Pradeep Sagar
---------------------------------------------------------